‘ఏ చాయ్ చటుక్కునా తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్’ అంటూ ఓ సినీ గేయ రచయిత చెప్పినట్లు.. ఛాయ్ తాగితే వచ్చే ఉత్సాహమే వేరు అంటున్నారు టీ ప్రేమికులు. చాలామందికి గొంతులో ఛాయ్ పడందే దినచర్య మొదలు కాదు. ఇక ఛాయ్‌లు మీద ఛాయ్‌లు లాగించేవారు ఉన్నారు. చల్లటి చిరు జల్లులు పడే సమయంలో వేడీ వేడీ ఛాయ్ తాగితే ఉండే మజానే వేరు అంటున్నారు టీ లవర్స్.

ఏమాత్రం తీరిక దొరికినా, అలసటగా అనిపించినా.. టీనిలాగించేస్తుంటారు. అయితే ఇలా ఛాయ్ లు లాగించడం ఆరోగ్యానికి మంచిందేనా.. నిపుణులు ఏమంటున్నారు.. నేడు సెప్టెంబర్ 21 నేషనల్ ఛాయ్ దినోత్సవం సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం.. ఎండాకాలం, చలికాలంలో కంటే వర్షాకాలంలో టీలు తాగేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. వర్షాకాలంలో మన శరీరంలో ఆటోమెటిక్ గా తేమ తగ్గిపోతుంది.
దీని వల్ల రెగ్యులర్ గా వాష్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థతి కూడా రావొచ్చు. అందుకే ఈ కాలంలో మన బాడీకి ఎక్కువగా ఫ్లూయిడ్స్ అందించాలి. దీనికి రెమిడీగా అల్లం టీ తీసుకుంటే మంచిదంటూ చెప్పారు. అంతేకాకుండా వేడి వేడి టీ తాగడం వల్ల ప్రమాదం ఉంటుందని.. దీని వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పారు.
దీనికి గల కారణం ఏంటంటే.. వేడి, వేడి టీ తాగే అలవాటు ఉన్నవారు అన్నవాహిక కాన్సర్ వచ్చే ముప్పు రెండింతలు అవుతుందట. 75 డిగ్రీల సెల్సీయస్ కంటే ఎక్కువగా టీ వేడి ఉండకూడదట. వేడి వేడి టీని తెచ్చిన వెంటనే కాకుండా కొద్ది సేపు ఆగి టీని తాగితే మంచింది. ఇకపోతే టీ కంటే కాఫీనే ఎక్కువ ఇష్టపడితే మాత్రం అనర్థమే. కాబట్టి.. టీ తాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇండియాలో 10 మందిలో ఎనిమిది మంది కాఫీ కంటే టీ తాగడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు.


































