ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30వ తేదీ లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా సిరివెన్నెల మరణవార్త తెలుసుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్రమంలోనే సిరివెన్నెలతో పరిచయం ఉన్న ఎంతో మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఇక సిరివెన్నెల పార్ధివదేహాన్ని ఫిలింఛాంబర్ లో ఉంచగా చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాజమౌళి, క్రిష్,రాజశేఖర్, తివిక్రమ్, నాగబాబు, శర్వానంద్,అల్లు అర్జున్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.
సిరివెన్నెల కడసారి చూపు కోసం టాలీవుడ్ సినీ ప్రపంచం మొత్తం కదిలి వచ్చినప్పటికీ ఆయన అంత్యక్రియలు మంచు కుటుంబం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ప్రముఖ సినీ గేయ రచయిత మరణిస్తే కడసారి చూపు కోసం మంచు ఫ్యామిలీ కనిపించకపోవడంతో ఎంతోమంది అసలు సిరివెన్నెల అంత్యక్రియలకు మంచు కుటుంబం దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
తాజాగా ఈ విషయంపై మంచు మోహన్ బాబు స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం తిరుపతిలో నివసిస్తున్నటువంటి మోహన్ బాబు తమ్ముడు మరణించిన సంగతి మనకు తెలిసిందే. తన తమ్ముడు మరణించడం వల్ల తమ కుటుంబసభ్యులు బయటకు వెళ్లకూడదని చెప్పడం వల్ల ఎవరు కూడా సిరివెన్నెల అంత్యక్రియల్లో పాల్గొనలేదు. ఆయన ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మోహన్ బాబు తెలిపారు.
































