Poonam Kaur: తెలుగు సినీ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాకుండా పూనన్ కౌర్ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో తరచుగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.

ఈ నేపథ్యంలోనే కొన్నిసార్లు ఆమె చేసే పలు వ్యాఖ్యలు అప్పుడప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు ఆమె ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటుంది. ఇక తన ఫై మితిమీరి ట్రోలింగ్స్ చేసేవారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు పూనం కౌర్ తనకు సంబంధం లేని విషయాల గురించి స్పందిస్తూ ఉంటుంది. రాజకీయాల గురించి, అదేవిధంగా సినిమాల గురించి ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్ ను సదరు యాంకర్ పవన్ కళ్యాణ్ గురించి అడగగా కాంట్రవర్సి అంటూ సమాధానం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడిన, నెగిటివ్ గా మాట్లాడిన ప్రాబ్లమే అవుతుందని ఆమె తెలిపింది అయితే ఇంతకు ముందు అతనితో మీరు కలిసి నటించారు కదా అని యాంకర్ ప్రశ్నించగా..
ఇంకా మాట్లాడాలంటే సిగ్గేస్తుంది…
ఆ విషయంపై స్పందిస్తూ.. చాలామంది చేయనివ్వలేదు అని చెప్పుకొచ్చింది.. ఇంకా మాట్లాడుతూ అయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది.. దేవుడా,అంటూ పవన్ కళ్యాణ్ ను తలచుకొని నవ్వేసింది పూనమ్ కౌర్. ఇకపోతే పూనమ్ కౌర్ తాజాగా నటించిన చిత్రం నాతిచరామి. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత నాతిచరామి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా క్రమంగా వరుసగా ఇంటర్వ్యూలకు పాల్గొంటోంది.



























