నందమూరి తారక రామారావు భూకైలాస్ సినిమా తర్వాత రావణుడి పాత్రలో 1961 సంవత్సరంలో ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో రామారావు పోషించిన రావణ పాత్ర ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. రావణుడి పాత్ర అనేది నాకు ఫేవరేట్ అంటూ అతడు అప్పట్లో చెప్పుకొనే వారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు.

ఇందులో శ్రీరామునిగా హరనాథ్ ను ఎంపిక చేయగా.. సీతగా గీతాంజలిని ఎంపిక చేశారు. ఆ విషయం తెలుసుకున్న శోభన్ బాబు.. ఓ రోజు ‘దైవబలం’ సెట్ లో ఉన్న ఎన్టీఆర్ ను కలిసేందుకు వెళ్లారట. అక్కడ ఎన్టీఆర్ అతడిని ‘రండి బ్రదర్..’ అంటూ ఆప్యాయంగా పలకరించి.. ఏ వేషం వేస్తావని అడగడంతో.. కంగారులో లక్ష్మణుడి పాత్ర వేస్తానని చెప్పారట శోభన్ బాబు.

దీంతో ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో శోభన్ బాబుకు లక్ష్మణుడి పాత్రలో చేసేందుకు అవకాశం వచ్చిందట. అస్సలు ఆ సినిమాలో లక్ష్మణుడి పాత్ర చాలా చిన్నది. అయినా శోభన్ బాబు అందులో నటించారు. ఆ సినిమా చేసిన వెంటనే శోభన్ బాబుకి ‘భీష్మ’ సినిమాలో పనిచేసే అవకాశం కల్పించారు ఎన్టీఆర్. అందులో అర్జునుని వేషం వేశారు శోభన్ బాబు. అలా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో శోభన్ బాబును నందమూరి తారకరామారావు ప్రోత్సహించడంతో తన కెరీర్ ను ముందుకు సాగించారు.

ఈ సినిమాలో నారద పాత్ర కాంతారావు ధరించారు. చిత్రానికి తొలుత ఎస్.రాజేశ్వరరావు పనిచేశారు. రుద్రవీణతో శివుని ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట ‘కానరార కైలాస నివాస’, ‘జటాకటాహ’ మొదలైనవి రాజేశ్వరరావు స్వరపరచారు. తెలుగు చిత్రగీతాల్లో ‘ఆల్ టైమ్ సూపర్ హిట్’ గా చెప్పదగిన ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’ పాట ఇందులోనిదే.
































