సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం కావాలని ఎంతో కష్టపడుతుంటారు. తమ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా,ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.కానీ మనకు తెలిసి కొన్ని పొరపాట్లు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి మన ఇంట్లో కొలువై ఉండదని చెబుతుంటారు. అయితే ఎలాంటి పొరపాట్లు చేయడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉండదో ఇక్కడ తెలుసుకుందాం…

ఎవరైతే మన ఇంటి సింహ ద్వారం ముందు చెప్పులు వదులుతారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. అదేవిధంగా గడపల సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ఎవరైతే కడప రైతు ఇంటిలోనికి ప్రవేశిస్తారో, గడపకు అటువైపు ఇటువైపు కాళ్ళు పెట్టుకొని మాట్లాడే వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండదు. అమ్మవారికి ఇష్టమైన మంగళవారం లేదా శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేయటం వల్ల అనుగ్రహం కలిగి మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ప్రతిరోజు ఎవరైతే ఉదయం ఇంటి ముందు చెత్త గురించి ముగ్గులు పెడతారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద గోడలకు ఎరుపు రంగుతో స్వస్తిక్ గుర్తును వేయటం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయి.అయితే ఆ ఇంటి ఇల్లాలు ఎల్లప్పుడు అసంతృప్తితో బాధపడుతూ ఉండకూడదు. మన ఇంట్లో చెడిపోయిన గడియారాలు, పగిలిపోయిన అద్దం, చిరిగిపోయిన వస్త్రాలు అస్సలు ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు ఎవరి ఇంట్లో అయితే ఇలాంటి నియమాలను పాటిస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here