“బాహుబలి” తో తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకధీరుడు రాజమౌళి, అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ కథలను అందిస్తూ అయన పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజగా విజయేంద్ర ప్రసాద్ “అలీతో సరదాగా” షోలో పలు ఆశక్తికర విషయాలు బయటపెట్టారు. “మీ అబ్బాయి రాజమౌళి కాకుండా మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అని హోస్ట్ అలీ అడగడంతో అందరూ షాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చారు.’ అలీ అడిగిన ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్… ఇంకెవరు “పూరీ జగన్నాథ్” అని సమాధానం చెప్పారు. అంతేకాదు పూరీ జగన్నాథ్ అంటే తనకు అసూయ ఆని, ఆయన తన శాత్రువు అని.. “నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను” అని నవ్వుతూ అందరూ ఆశ్చర్యపోయేలా చూపించారు విజయేంద్ర ప్రసాద్. మొత్తానికి మన పూరీ మామూలోడు కాదు అని మరోసారి అందరికీ స్పష్టం అయింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేస్తున్న ఈయన సినిమా అద్బుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.































