రోజు రోజుకు హత్యలు, ఆత్మహత్యల ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలతో హత్యలు చేస్తున్నారు. అంతేకాదు తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజగా కట్టుకున్న భర్తకు అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపింది భార్య. నగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం మంగనూరులో ఈ దారుణం జరిగింది. పోలీసులు తేలిపైనే వివరాల ప్రకారం ముంగనూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్, అతని భార్య ఇద్దరు ఆరుబయట నిద్రపోతున్నారు. సరిగ్గా అర్ధరాత్రి చుట్టుపక్కనవారు అందరు నిద్రపోయిన తరువాత నిద్రలో ఉన్న భర్త గొంతుకోసి హత్యచేసింది. ఆపై కత్తి భర్త చేతిలో పెట్టి తన భర్తే ఆత్మహత్య చేసుకున్నట్టు చుట్టుపక్కన వారిని నమ్మించే ప్రయత్నం చేసింది.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ విషయంపై అతని భార్యని ప్రశ్నిస్తుండగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీనితో అనుమానం ఆమెపై అనుమానం వచ్చింది. అదే సమయంలో ఇరుగుపొరుగు వారిని ప్రశ్నించగా శ్రీనివాస్ గత కొంతకాలంగా మద్యానికి బానిసైనట్టు వారు చెబుతున్నారు. అయితే లాక్ డౌన్ సమయం కావడంతో గత కొద్దిరోజులుగా బాగానే ఉన్నాడని అయితే మద్యం దుఖాణాలు మళ్ళీ తెరుచుకోవడంతో తాగిరావడం, భార్య భర్తల మధ్య ఈ విషయంపై గొడవలు జరుగుతుండేవని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పెట్టె వేధింపులు తట్టుకోలేకే ఆమె హత్య చేసినట్టు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
































