Pushpa 2: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం పుష్ప.ఈ సినిమా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి విపరీతమైన ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పార్ట్ వన్ కి మించి ఉండేలా దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సుకుమార్ తనకు సహాయంగా తన శిష్యుడు బుచ్చిబాబును తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ కూర్చొని ఈ సినిమా పనులకి సంబంధించిన విషయాలను చర్చించుకుంటున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి గురు శిష్యులు ఇద్దరు కలిసి ఈ సినిమాని ఎలా తీర్చిదిద్దారో తెలియాలంటే మనం ఈ సినిమాని స్క్రీన్ పై చూసేవరకు వేచి చూడాలి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి అయిన వెంటనే సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
పుష్ప సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు…
ఆగస్టు రెండవ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇకపోతే ఈ సినిమా కోసం ఏకంగా 350 కోట్ల బడ్జెట్ కేటాయించారనీ తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ కే ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా కోసం ఏకంగా సౌత్ నార్త్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
































