ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన విప్రో కరోనా సంక్షోభ సమయంలో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ 2021 ద్వారా దేశంలోని ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమైంది. ప్రతిభ ఉండి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు విప్రో కంపెనీ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను పొందవచ్చు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 5వ తేదీ అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉంటే manager.campus@wipro.com కు మెయిల్ చేయడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

2021 సంవత్సరం జనవరి 18వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మూడున్నర లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. పదో తరగతి, ఇంటర్ 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో గ్యాడ్యుయేషన్ 65 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

10వ తరగతి, గ్రాడ్యుయేషన్ మధ్య మూడు సంవత్సరాలు గ్యాప్ లేని విద్యార్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన కాలేజీల నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సు చదివి సెలక్షన్ నాటికి బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here