దారుణం: భర్త ఆ భాగాలను కోసి కూర వండిన భార్య.. చివరికి?

0
269

సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు భార్య భర్తలు ఎన్నోసార్లు గొడవపడి తర్వాత మామూలుగా కలిసిమెలిసి ఉంటారు. కానీ బ్రెజిల్ కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవపడి అతనిని చంపి అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి తన భర్త మర్మాంగాలతో కూర వండిన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రెజిల్లోని సావో గొంకలో నివసిస్తున్న దయానే క్రిస్టినా రోడ్రిగ్స్ మచాడో అనే మహిళ తన భర్తను చంపడమే కాకుండా శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోసి అతని మర్మాంగాలతో ఫ్రై చేసింది. జూన్ 7వ తేదీన సావో తన భర్త ఆండ్రీతో గొడవ పడింది. ఈ క్రమంలోనే ఆండ్రీ అర్థ నాదాలు చేయడం చుట్టుపక్కల వాళ్లు కూడా విన్నారు.తరచూ వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు.

ఈ క్రమంలోనే సావోతో అండ్రీ గొడవపడిన ప్పటినుంచి కనిపించకపోవడంతో అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నగ్నంగా రక్తపుమడుగులో ముక్కలు ముక్కలుగా ఆండ్రీ మృతదేహం కనిపించింది. అదేవిధంగా సావో అతని మర్మాంగాలను కోసి సోయాబీన్ సాస్ వేసి ఫ్రై చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరచగా ఆమె తరపు న్యాయవాది ఆండ్రీ సావోను చంపడానికి రావడంతో ఆత్మరక్షణ కోసం తనను హత్య చేసినట్లు తెలిపారు. ఈక్రమంలోనే ఆత్మరక్షణ కోసమే చంపినట్లు అయితే ముందుగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, అతని శరీరాన్ని ఎందుకు ముక్కలుగా ఖండించాలని ప్రశ్నించారు. అయితే వీరిద్దరి మధ్య గొడవ రావడానికి గల కారణాలు ఏమిటనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.