Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా తెలంగాణ పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితం అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం అమలులో ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీలో మహిళల ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.

ఇలా ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో మహిళలు ప్రయాణం చేస్తున్నారు. లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీలో ప్రయాణం చేసే వారి సంఖ్యలో ఉందని అధికారులు తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈ ఉచిత స్కీం ద్వారా మహిళలు ఏ ఏ ప్రదేశాలకు ప్రయాణం చేస్తున్నారా అనే విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఉచిత ప్రయాణం కావడంతో మహిళలందరూ కూడా ఎక్కువగా దైవ దర్శనాలకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు వేములవాడ, కాలేశ్వరం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ప్రయాణం చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు.
పుణ్యక్షేత్రాలకు ప్రయాణం…
ఈ పథకం డిసెంబర్ 9వ తేదీ అమలులోకి తీసుకువచ్చారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్దరాత్రి వరకు 94,128 మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు. 10వ తేదీ ఆదివారం రోజు 2,26,645 మంది మహిళలు ప్రయాణం చేశారు. 11వ తేదీ రెండు లక్షలకు పైగా ప్రయాణం చేశారు. ఇలా ప్రతిరోజు లక్షల సంఖ్యలోనే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని అధికారులు తెలిపారు.



























