అన్ని బంధాలకంటే భార్యభర్తలు బంధం గొప్పది. ఒకరికి ఒకరు తోడుంటూ.. నిండు నూరేళ్ల వరకు కలిసి ఉంటారు దంపతులు. అయితే కొన్ని కారణాల వల్ల చాలా మంది తమ దంపత్య జీవితానికి బ్రేక్ లు వేసుకుంటున్నారు. ఇలా తమ భార్య నుంచి భర్త, భర్తల నుంచి భార్యలు విడాకులు తీసుకుంటున్నారు.

ఇలా వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న కొంతమంది క్రికెటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అందరికీ తెలిసిందే. అతడు మొదట నౌరీన్ అనే యువతిని పెళ్లి చేసుకొని.. విడాకులు తీసుకుకన్నారు. తర్వాత 1996లో నటి సంగీత బిల్జానీని వివాహం చేసుకున్నాడు.
మరో క్రికెటర్.. దినేష్ కార్తీక్ చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె మరో క్రికెటర్ మరళీ విజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో విడాకులు తీసుకొని.. స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ బౌలర్.. మహ్మద్ షమీ కూడా.. 2014 లో హసీన్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు.
తర్వాత కొన్ని కారణాల కారణంగా హసీన్ జహాన్, మహమ్మద్ షమీ విడాకులు తీసుకున్నారు. భారత ఫాస్ట్ బౌలర్ శ్రీనాథ్.. మొదట జ్యోత్స్నను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి మాధవి పాత్రవాలి అనే జర్నలిస్ట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఇండియన్ క్రెకెటర్లే కాదు.. విదేవీ క్రికెటర్లు కూడా మొదట వివాహం విడాకుల వరకు వెళ్లారు. అందులో బ్రెట్ లీ, జాంటీ రోడ్స్, సనత్ జయసూర్య, షోయబ్ మాలిక్ మరియు మైఖెల్ క్లార్క్ లాంటి వారు ఉన్నారు.































