రోబోలు తయారు చేసిన బ్రిడ్జి..ఫోటోలు వైరల్!

0
112

రోబో అనగానే మనకి రజనీ కాంత్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో రజనీ కాంత్ తయారు చేసిన రోబో అందరికీ గుర్తుండే ఉంటుంది.అన్ని పనులను ఎంతో చకచకా చేస్తూ అందరిని ఆకట్టుకుంది.అచ్చం సినిమాలో మాదిరి నిజంగానే అన్నిచోట్ల రోబో ఉంటే ఎంతో బాగుంటుందనే భావిస్తాము.ఈ క్రమంలోనే ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా రోబోలు ఒక బ్రిడ్జిని నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రోబో లేంటి బ్రిడ్జ్ నిర్మిండం ఏంటని ఆలోచిస్తున్నారా… అయితే ఈ బ్రిడ్జి గురించి తెలుసుకోవాల్సిందే…

ప్రపంచంలోనే తొలిసారిగా కార్మికులు లేకుండా కేవలం రోబోల సహాయంతోనే నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టార్‌డమ్‌ నగరంలో నిర్మించారు. ఈ బ్రిడ్జి ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ప్రింటింగ్ వంతెన కావడం మరొక విశేషమని చెప్పవచ్చు. సుమారు 12 మీటర్ల ఈ వంతెనను 4,500 కిలోల ఉక్కును ఉపయోగించి సుమారు ఆరు నెలల కాలం పాటు రోబోలు నిర్మించాయి. 3d బ్రిడ్జ్ ను నెదర్లాండ్స్‌కు చెందిన ఎంఎక్స్‌ 3 డీ సంస్థ రూపొందించింది.

ఈ బ్రిడ్జిని ఒకేసారి కాలువపై కాకుండా వేరే చోట తయారు చేసే పడవ సహాయంతో కాలువ దగ్గరకు తీసుకువచ్చి క్రేన్ ద్వారా కాలువపై అమర్చారు. ఈ విధంగా రోబోలు తయారు చేసిన బ్రిడ్జ్ ను ఆదేశ యువరాణి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్మించడం ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారి ఎంతో మందిని ఆకర్షిస్తోంది.

ఈ బ్రిడ్జి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో డజనుకు పైగా సెన్సార్లు అమర్చి ఉన్నారు. బ్రిడ్జిలో ఏదైనా ప్రమాదం తలెత్తితే సెన్సార్ల సహాయంతో ఆ ప్రమాదాన్ని గుర్తించవచ్చు. ఈ వంతెనకు సంబంధించిన పూర్తి వివరాలు అన్ని డేటా కంప్యూటర్లు సేవ్ చేయబడి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎంతటి బరువునైనా మోయగలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here