Writer Macha Ravi : ఆర్జీవి ట్వీట్స్ నాకు నచ్చవ్… మెగా ఫ్యామిలీతో ఎందుకు దూరం…: రైటర్ మచ్చ రవి

0
85

Writer Macha Ravi : రైటర్ గాను అటు డైరెక్టర్ గాను మంచి గుర్తింపు అందుకున్న మచ్చ రవి అసలు పేరు బాచు మంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి కాగా బివీఎస్ రవి, మచ్చ రవిగా బాగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. నిజానికి తాజాగా ఆహా లో వస్తున్న అన్ స్టాపబుల్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్న రవి మొదట రైటర్ గా పోసాని గారి వద్ద పనిచేసి పోసాని రైటర్ గా చేసిన సినిమాలకు సహాయం చేసారు. అయోధ్య రామయ్య, భద్రాచలం, సీతా రామరాజు, సీతయ్య వంటి సినమాలకు పోసాని అసిస్టెంట్ గా పనిచేసారు రవి. బి టెక్ బళ్లారిలో చేస్తున్న సమయంలో కొరటాల శివ ఫ్రెండ్ అవడం, అలా కొరటాల శివ మేనమామ అయిన పోసాని వద్ద చేరాడు. ఇక గోపీచంద్ హీరోగా వచ్చిన వాంటెడ్ సినిమాతో డైరెక్టర్ అయిన రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడారు.

అర్జీవి ట్వీట్స్ నచ్చవు…

మచ్చ రవికి రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్, కృష్ణ వంశీ, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, రవితేజ, దిల్ రాజు, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్నలతో మంచి సన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా ఆర్జీవి తో వారానికి రెండు మూడు సార్లు కలిసే చనువు ఉందట రవికి. నిజానికి అర్జీవి అంటే తనకు చాలా ఇష్టమని అసలు మచ్చ రవికి అర్జీవీ అంత క్లోజ్ ఎలా అయ్యాడు అనే విషయం రవి ఇంటర్వ్యూలో తెలిపారు. నేను చాలా ప్రాక్టికల్ గా ఉంటాను అలాగే వర్మకి నచ్చని విషయంను నేను నచ్చే విధంగా చెప్పడం వర్మకు నచ్చుతుంది అంటూ అందుకే మా ఇద్దరికి స్నేహం కుదిరింది అంటూ చెప్తాడు రవి.

ఇక వర్మ ఇతర కార్యకలాపాలు నేను మాట్లాడను, తన అభిప్రాయాలు వేరు నా అభిప్రాయాలు వేరు, కొన్ని విషయాలలో విభిన్నంగా ఉంటాం. తాను చేసే ట్వీట్స్ నాకు నచ్చవ్ కానీ ఎందుకు అలా పెట్టావ్ అంటూ ఆ విషయం అడగను అలాంటి విషయాలు చర్చించం అంటూ చెప్పారు. ఇక మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని కథ సిద్ధం చేసుకున్నా వర్క్ అవుట్ కాలేదు. సాయి ధరమ్ తేజ్ తో జవాన్ చేశాను. మెగా ఫ్యామిలీ తో గ్యాప్ ఏం రాలేదు. కేవలం కరోనా లాక్ డౌన్ వల్ల కొన్ని సినిమాలను సెట్ చేయలేక పోయాం అంటూ చెప్పారు.