Yadama Raju: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలో తొందరగా ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం అంతే తొందరగా విడాకులు తీసుకొని విడిపోవడం జరుగుతుంది. అయితే జబర్దస్త్ కమెడీయన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాదమ్మ రాజు గత ఏడాది స్టెల్లా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.

ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటున్న మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నటువంటి యాదమ్మ రాజు స్టెల్లా విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా వీరి విడాకుల గురించి వార్తలు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీరిద్దరి వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే విడాకులు తీసుకోవడం ఏంటి అని కంగారు పడుతున్నారు. అయితే ఇది నిజం కాదని ఒక కార్యక్రమం కోసం ఇలా విడాకులు అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారనే విషయం తెలియడంతో ఒక్కసారిగా బుల్లితెర కార్యక్రమం పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరు విడాకులు తీసుకున్నారని చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Yadama Raju బుల్లితెర షో కోసం మాత్రమే…
ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రతివారం ఏదో ఒక స్పెషల్ కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారు. అయితే తాజాగా విడాకులు ద్వారా వచ్చారు. ఇందులో భాగంగా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో యాదమ్మ రాజు స్టెల్లా మధ్య గొడవ జరగడంతో విడాకులు తీసుకుందామని ఫిక్స్ అవుతారు. అయితే పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో విడాకులు కూడా అంతే గ్రాండ్గా జరగాలి అంటూ స్టెల్లా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ మండిపడుతున్నారు.































