గత కొన్ని నెలలుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు, ఇతర వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో ఉండి రఘురామ ప్రతి విషయంలోనూ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విమర్శలు చేయడం ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. సీఎం జగన్ ను సైతం టార్గెట్ చేసి రఘురామ అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఫారెన్ యువతి రఘురామ కృష్ణంరాజు నోట్లో మందు పోస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. రఘురామ పబ్బులో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండటంతో ఆయనను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు నిన్నటి నుంచి తెగ ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఫారిన్ పాపలతో ఈ పత్తేపారం ఏంటని.. మరికొందరు రసికరాజా అంటూ రఘురామ కృష్ణంరాజుపై అసభ్యకరరీతిలో పోస్టులు పెడుతున్నారు.
రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుండగా ఎట్టకేలకు రఘురామ ఫోటో గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఫోటో మూడు సంవత్సరాల క్రితం తాను ఒక పార్టీకి హాజరైన సమయంలో తీశారని ఆయన అన్నారు. ఆ ఫోటోను సుబారెడ్డి అనే వ్యక్తి ఇచ్చారని తాను భావిస్తున్నానని ఆ ఫోటోలో తప్పేముందో తనకు అర్థం కావడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక ఎంపీ కుమారుడి ఫంక్షన్ కు హాజరైన సమయంలో సెలబ్రేషన్స్‌లో భాగంగా తన నోట్లో షాంపైన్ పోశారని.. వాళ్లు రష్యన్ అమ్మాయిలని అన్నారు. తాను అసభ్యంగా మాట్లాడలేదని, ఎవరి మీద చేతులు వేయలేదని చెప్పారు. వైసీపీ వాళ్లు ఇచ్చిన పార్టీల్లో సైతం ఫారిన్ అమ్మాయిలు ఉంటారంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫోటోను ఉపయోగించి తనపై అసభ్యకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. తాను నోట్లో షాంపైన్ పోసుకోవడం వైసీపీ నేతలకు బాధ కలిగించిందేమోనని వెల్లడించారు.



































