దేవుడి భక్తి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానికి కొంత మంది గుళ్ల చుట్టూ తిరుగుతుంటారు. మరికొంత మందికి ఆ అలవాటు ఉండదు. ఇక ఆలయాలు దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయాలను భూమిలోని మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు.

ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించారు. అందుకే అలాంటి ఆలయాల్లో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఆలయాల్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఆ నియమాలు ఏంటంటే.. ముందుగా గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అక్కడ ఎలాంటి ధ్వజ స్తంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ ప్రదక్షిణ చేసే సమయంలో దాట కూడదు. దేవుడి విగ్రహం కింద నిలబడి ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు. దేవాలయంలో దేవుడికి వెనకాల కూర్చోకూడదు. దేవాలయంలోకి ప్రేవేశించిన ఏ భక్తుడు ఏడవకూడదు.
ఖాళీ చేతులతో దేవుడి గుడిలోకి వెళ్ల కూడదు. వస్త్రాలను కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా ధరించడానికి వీళ్లేదు. ఇక గుడి దగ్గర యాచించే వాళ్లకు తోచిన సహాయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గుడిలోకి జుట్టు విరబోసుకొని వెళ్లకూడదు. దేవుడికి ఎదురుగా నష్టాంగ నమస్కారం చేయకూడదు.































