Ester Noronha: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన నిజం.అయితే ఇండస్ట్రీలో ముందుకు కొనసాగాలంటే తప్పనిసరిగా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాలని, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని చాలా మంది ఇదివరకే బహిరంగంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా నటి ఎస్తర్ నోరోన్హ (సింగర్ నోయల్ మాజీ భార్య) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి నటనపై ఆసక్తితో వచ్చానని అయితే ఇక్కడ అవకాశాలు రావాలంటే తప్పకుండా కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని ఇలా చెప్పిన మాట వింటే ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వస్తాయని డైరెక్ట్ గా నాకు అర్థం అయ్యే విధంగా చెప్పారని ఈమె తెలియజేశారు.

ఈ విధంగా కమిట్మెంట్ కి ఒప్పుకోకపోతే కెరియర్ ఇక్కడితోనే ఆగిపోతుందని ముందుకు వెళ్లలేరని బెదిరించారు.ఈ విధం నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని సినిమాలో నటించాలని ఆశగా ఉంది కానీ సినిమానే జీవితం కాదు ఇంత దిగజారి నటించాల్సిన అవసరం నాకు లేదని నేను ఇలాంటి వాటికి నో చెప్పానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.
ఆరు నెలలకే విడాకులు…
ఇలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కన్నడ నుంచి తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. ఇకపోతే ఈమె సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఆరు నెలలు కూడా గడవకముందే వీరిద్దరు విడాకులతో విడిపోయారు.ఇక ఈమె తెలుగులో భీమవరం బుల్లోడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. అలాగే గరం సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా సందడి చేశారు. ఇక రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో ఓ పాత్రలో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.






























