ప్రతీ ఒక్క మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. నీళ్లు కూడా అంతే ముఖ్యం. ప్రతీ రోజు తగినన్ని నీళ్లు తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. ఒక వేళ నీళ్లు మన శరీరానికి తగినన్ని లేకపోతే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వీటిని గమనిస్తూ నీళ్లు తాగాలి. అయితే ఇలా నీళ్లను తాగకపోతే.. శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం..

ముఖ్యంగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉండగా.. మూత్రం కూడా ముదురు పసుపు లేదా గోధుమ రంగుల్లో వస్తుంది ఇలా వస్తుందంటే.. శరీరంలో తగినంత నీరు లేదనే అర్థం. నోరు కూడా తడి ఆరిపోతుందని.. దీంతో నోట్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
దాని వల్ల నోరు దుర్వాసన కూడా వస్తుందని.. తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందుతామని తెలిపారు. నీళ్లను తక్కువగా తాగడం వల్ల రక్త సరఫరాకు కూడా అంతరాయం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అని అతిగా నీళ్లు తాగినా ప్రమాదకరమే. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కువగా నీరు తాగడం వల్ల మెదడుపై ఆ ప్రభావం పడుతుంది.
బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో, అంతే నీళ్లు తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. అంతే కాకుండా తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. దాదాపు రోజుకు ప్రతీ మనిషి సగటున 4 లీటర్ల నీళ్లు తాగాలని వైద్యలు సలహా.


































