YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజలలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఈయన అధికారం కోల్పోవడమే కాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు దాడులను ఇదివరకు ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 50 రోజులపాటు పర్యటన చేయాలనే నిర్ణయం తీసుకున్నారు అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు పూర్తి అయిన తర్వాత కూటమి పాలన గురించి ఈయన గ్రౌండ్ లెవెల్ లో ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రజలతో మమేకం అవ్వడమే కాకుండా పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా ఈయన కలవనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 25 ఎంపీ స్థానాల్లో ఉన్నాయి అయితే ఈయన ఎంపి స్థానాల పరిధిలో పర్యటించబోతున్నారని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటన చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నేతలు అలాగే కార్యకర్తలతో కూడా జగన్ మాట్లాడబోతున్నారని సమాచారం.

YS Jagan: జనంలోకి జగన్…
ఇక గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వ పాలన ఎలాగుంది ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలుపరిచారు అనే విషయాల గురించి కూడా ఈయన ఆరా తీయబోతున్నారని సమాచారం. అయితే ఈ పర్యటన మాత్రం వచ్చే యేడాది సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇంకా ఇప్పటివరకు ఈ పర్యటన గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడ లేదు కానీ ఈయన పర్యటనకు మాత్రం అన్ని సిద్ధమయ్యాయి అని సమాచారం.





























