కరోనా మహమ్మారి దెబ్బకు అటు ఆరోగ్యంతో పాటూ.. ఆర్ధికంగా కూడా చితికిపోతున్నారు.. అయితే ఇటువంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం పని చేస్తున్న మరియు ఇదివరకే పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు వారి మీద ఆధారపడ్డ కుటుంబానికి సైతం.. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇన్‌పెషేంట్ వార్డుల్లో కొవిడ్ చికిత్స పొందితే వారికి మెడికల్ రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్ఏఎమ్ రిజ్వీ తెలిపారు.

రూ. లక్ష వరకు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ప్రయివేటు ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన వారికే రీఎంబర్స్‌మెంట్ వర్తించనుంది. అయితే తాజగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినదే.






























