నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఈ సందర్బంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా అత్యుత్తమమైన మార్గమని అన్నారు. యోగావల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుందని అయన తెలిపారు.

ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. దీనివల్ల శాంతి, సామరస్యం పెరుగుతాయని తాను నమ్ముతున్నానని చెప్పారు. అంర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలోని తన నివాసంలో యోగాసనాలు వేశారు.



























