కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పిల్లల స్కూల్స్ మూతపడ్డాయి. ఈ క్రమంలోనే వివిధ పరీక్షలన్నీ కూడా రద్దయ్యాయి. అయితే కొన్ని ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల నిర్వహణ వాయిదా పడ్డాయి. అయితే ఇటువంటి సమయంలో తిరిగి పిల్లలకు స్కూల్స్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ విషయంపై నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత ఎక్కువ మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని.. అప్పుడు మాత్రమే పిల్లల స్కూల్స్ తెరవడం ఉత్తమమని అయన అన్నారు. మరోవైపు థర్డ్ వేవ్ వ్యాప్తి, ఇది చిన్నారులపై ప్రభావం ఎక్కువగా చూపబోతుందన్న వార్తల నేపథ్యంలో మరింత ఆచితూచి వ్యవహరించాల్సిఉంది అని వీకే పాల్ అన్నారు. కరోనా వల్ల హాని ఉండబోదన్న భరోసా లభించినంత వరకు పాఠశాలలు తెరవకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.






























