దేశంలోని ప్రజల్లో చాలామంది ఇప్పటివరకు 2020 లాంటి సంవత్సరాన్ని తాము చూడలేదని చెబుతున్నారు. ఈ ఏడాది దేశంలో గతంలో ఏ వైరస్ వ్యాప్తి చెందనంత వేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందింది. దేశంలోని ప్రజలకు ఏ మాత్రం అవగాహన లేని లాక్ డౌన్ కరోనా వల్ల సుపరిచితమైంది. ప్రతి సంవత్సరం లక్షల్లో లాభాలు పొందిన వ్యాపారులు ఈ ఏడాది నష్టాలను చవిచూశారు.

ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. గతంలో ఎప్పుడూ అప్పుపై ఆధారపడని వారు సైతం ఈ ఏడాది అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంతోఇంతో మెరుగ్గా ఉన్నా వేతనాల్లో కోత విధించడంతో ప్రైవేట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పదేళ్ల క్రితమే 2020 గురించి ఊహించి ఒక బాలుడు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బాలుడు కరోనా వైరస్ గురించి ప్రత్యక్షంగా ఏం చెప్పకపోయినా అతను చేసిన కామెంట్లలోని అర్థం గమనిస్తే అతను చెప్పింది నిజమేనని అర్థమవుతోంది. 2020 సంవత్సరంలో ప్రజలంతా ప్రశాంతంగా బ్రతుకుతారని.. ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడినా ధీటుగా ఎదుర్కొంటారని చెప్పాడు. ఈ సంవత్సరం నిజంగానే ప్రజలు ప్రశాంత జీవనం గడిపారు. ప్రజలు కరోనా లాంటి వ్యాధిని ధీటుగా ఎదుర్కొన్నారు.
కెవిన్ సింగ్ పదేళ్ల క్రితమే ఈ సంవత్సం పరిస్థితులను సరిగ్గా ఊహించడం గమనార్హం. కెవిన్ వర్జీనియా ప్రాంతానికి చెందిన వారు. తను చెప్పిన జాతకం నిజమైందని తెలిసి కెవిన్ సోషల్ మీడియా వేదికగా తనను క్షమించిమని పోస్ట్ పెట్టడం గమనార్హం.
sorry guys 😒 https://t.co/vPj3iTQzAj
— kevin singh (@McSapra) December 24, 2020































