ఐస్ క్రీమ్ లు తినేవారికి షాకింగ్ న్యూస్.. ఐస్‌క్రీమ్‌లో కరోనావైరస్..!

0
88

కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా కరోనా విషయంలో నిర్లక్ష్యంలో వహిస్తే ప్రమాదమని జరుగుతున్న ఘటనలు ప్రూవ్ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి పుట్టుకకు కారణమైన చైనాలో మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. చైనా దేశంలోని ఐస్ క్రీమ్ లలో కరోనా వైరస్ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏకంగా 4,800 ఐస్ క్రీమ్ బాక్సుల శాంపిల్స్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించడం గమనార్హం. కరోనా నిర్ధారణ అయిన ఐస్ క్రీమ్ బాక్సులన్నీ ఒకే కంపెనీకి చెందినవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఐస్ క్రీమ్ బాక్సుల్లో కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు ఆ ఐస్ క్రీమ్ ను తిన్నవారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయించే పనిలో పడ్డారు. 4,836 ఐస్ క్రీం బాక్సులలో 935 ఐస్ క్రీం బాక్సులు స్థానిక మార్కెట్ లోకి ఇప్పటికి వెళ్లిపోయాయని తెలుస్తోంది. అయితే వాటిలో కేవలం 65 బాక్సులను మాత్రమే విక్రయించారు. ఈ 65 బాక్సులలోని ఐస్ క్రీమ్ లను తిన్నవాళ్లు కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది.

టియాజిన్ మున్సిపాలిటీ ప్రాంతంలోని ఐస్ క్రీమ్ ను ల్యాబ్ కు పంపగా ఐస్ క్రీం కరోనా వైరస్ తో కలుషితమైందని శాస్త్రవేత్తలు గుర్తించడం గమనార్హం. ఐస్ క్రీమ్ లలో కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు ఆ ఐస్ క్రీమ్ లను తిన్నవారిని నిర్ధారించే పనిలో పడ్డారు. ఐస్ క్రీమ్ తయారీలో న్యూజిలాండ్ వెన్న, ప్రోటీన్, ఉక్రేయిన్ మిల్క్ పౌడర్ ను వాడారని సమాచారం. కలుషితమైన ఐస్ బాక్సులను ఇప్పటికే వేరు చేశారు.

ఐస్ క్రీమ్ బాక్సులలో కరోనా వెలుగులోకి రావడంతో ఐస్ క్రీమ్ లు తినేవాళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోల్డ్ టెంపరేచర్ దగ్గర కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఐస్ క్రీమ్ కంపెనీలో పని చేసే ఉద్యోగులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here