Indian Railway: రైల్వే డిపార్డ్ మెంట్ లో మనం ఎక్కువగా గార్డ్ లను చూస్తూ ఉంటాం. గూడ్స్ రైలు వెనుకాల కూర్చొని ఓ జెండా పట్టుకొని నిలబడుతూ కనిపించే ఈ గార్డ్ విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వారిని గార్డ్ లు కాకుండా.. రైలు మేనేజర్ (ట్రైన్ మేనేజర్ ) గా మారుస్తూ జనవరి 13 న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ డిమాండ్ గత కొంత కాలంగా ఉందని.. ఈ రోజుతో ఆ సమస్య తీరిందని.. రైల్వే మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు తెలిపారు. గార్డ్ పోస్ట్‌ను తక్షణమే అమలులోకి వచ్చేలా “ట్రైన్ మేనేజర్”గా రీడిజైన్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

సవరించిన హోదా వారి ప్రస్తుత విధులు , బాధ్యతలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సవరించిన ఈ మార్పులో .. ఇక నుంచి.. అసిస్టెంట్ గార్డ్ ఇప్పుడు ‘అసిస్టెంట్ ప్యాసింజర్ రైలు మేనేజర్’, గూడ్స్ గార్డ్ ‘గూడ్స్ రైలు మేనేజర్’, సీనియర్ ప్యాసింజర్ గార్డ్ ‘సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజర్’ గా.. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలు గార్డు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు మేనేజర్‌గా ఉంటారని పేర్కొంది.
తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు..
ఈ మార్పులు తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. నేటి సమాజంలో, అతను/ఆమె ఏదో ఒక ప్రైవేట్ సంస్థలో కాపలాదారినిగా ఎలా ఉంటారో అలా ఉంటున్నారనే చిన్న చూపు ఉందని.. అందుకే ఆ పేరును మార్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇది కేవలం పేరు మార్పు మాత్రమే అని.. జీతం, హోదాలో ఎలాంటి మార్పు లేదని.. అంతక ముందు ఎలాంటి జీతభత్యాలు ఉన్నాయో అలాగే ఉంటాయని పేర్కొన్నారు.































