Aacharya: మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇంతవరకు అసలు పరాజయం ఎరుగని కొరటాల శివ మొదటిసారి ఈ సినిమాతో భారీ పరాజయాన్ని చూసారు. ఈ సినిమాతో చాలా రోజుల తరువాత మణిశర్మ, చిరంజీవి సినిమాకు సంగీతం అందించారు. ఇక సినిమాలో తోలుత చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా అనుకున్నా తరువాత ఆమె ఉన్న సన్నివేశాలు తొలగించి చిరుకి జోడి లేకుండా కథ తీర్చిదిద్దారు.

ఇక రామ్ చరణ్ సరసన పూజహెగ్డే హీరోయిన్‌గా నటించినా ఆమెకు పెద్ద సన్నివేశాలేమి లేవు. ఇక సినిమాలో ఇద్దరు హీరోలను బ్యాలెన్సింగ్ సరిగా చేయలేదని ఎడిటింగ్ లో విఫలమయ్యారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇక సినిమాను పూర్తి చేయడానికి కరోనా లాక్ డౌన్ వల్ల నాలుగు సంవత్సరాలు పట్టడంతో సినిమా కథలో చాలా మార్పులు చేసారు. ఇక ఎన్ని సంవత్సరాలు సినిమా సాగడంతో సినిమా బడ్జెట్ బాగా పెరిగింది. అది కాక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంత బాగా ఏమి జరగలేదు.
ఇక సినిమాపై అభిమానుల అంచనాలు బాగా ఉన్నా సినిమా మాత్రం మొదటి రోజునుండే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుని డిజాస్టర్ గా మిగిలింది. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఈ విషయంలో చిరంజీవికి కూడా లేఖ రాసారు. బయ్యర్ల నష్టాలపై స్పందించకపోతే బయ్యర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ బాధను లేఖ రాసారు. ఇక సినిమా నష్టంపై ఇపుడు కొరటాల స్పందించారు. కొరటాలతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ లు కూడా ఎంతో కొంత డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
130 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా సినిమా లాభాలను రాబట్టకపోగా భారీ నష్టాలను మిగిల్చింది. అందుకే ఇప్పటికే చిరంజీవి 10కోట్లు ఇచ్చారట, ఇంకొంత మొత్తం త్వరలో ఇస్తారట, ఇక కొరటాల కూడా 25 కోట్లు ఇచ్చారని సమాచారం. ఒక దర్శకుడు ఇంత భారీ మొత్తంలో డబ్బు నష్టాన్ని పుడ్చడానికి బయ్యర్లకు ఇవ్వడం ఇదే తొలిసారి. అందుకే అందరూ కొరటాలను అభినందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ విషయంలో బయ్యర్లకు సహాయం చేయాలనుకుంటున్నారట అందుకే ఆయన కూడా త్వరలో డబ్బు ఇవ్వాలనుకుంటున్నారట. సినిమా ముక్కి మూలిగి 50 కోట్లు వసూలు చేసింది. ఇక 80 కోట్ల నష్టాన్ని బయ్యర్లు భరించాలి. ఇక దీంతో బయ్యర్లు రోడ్డున పడ్డారు. ఇక ఈ విషయంలో ముగ్గురు ఇలా బయ్యర్లకు ఎంతోకొంత డబ్బు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.


































