ఎయిర్‌‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏడాదికి 18 లక్షల రూపాయల వేతనంతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏఏఐ నుంచి మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

డిసెంబర్ 15వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 14వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ,ఎస్టీ, మహిళలకు దరఖాస్తు ఫీజు 170 రూపాయలుగా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపికైన వారు దేహదారుఢ్య పరీక్షలు, వాయిస్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. 2020 నవంబర్ 30 నాటికి మేనేజర్లకు 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళు మేనేజర్ ఉద్యోగాలకు, 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు జూనియర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ లకు 18 లక్షలు, జూనియర్ మేనేజర్ లకు 12 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.

బీఈ / బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అయిదు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మెకానికల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ ఉద్యోగాలకు 13 ఖాళీలు ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 355 ఖాళీలు ఉన్నాయి. http://www.aai.aero/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here