Aamir Khan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు రాజభోగాలను అనుభవిస్తారని భావిస్తారు.ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుని నటీనటులు విలాసవంతమైన భవనాలు ఖరీదైన కార్లు తిరుగుతూ చాలా గొప్పగా జీవిస్తూ ఉంటారని అందరూ భావిస్తారు. అయితే ఆ జీవితం వెనుక ఎలాంటి కష్టం ఉందో ఎవరు ఆలోచించరు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆమీర్ ఖాన్ ఇంటర్వ్యూ సందర్భంగా తన చిన్నప్పటి జ్ఞాపకాలను చిన్నతనంలో తాను అనుభవించిన కష్టాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.తనకు పది సంవత్సరాల వయసు ఉన్న సమయంలో తన తండ్రి లాకెట్ అనే ఒక సినిమాని చిత్రీకరిస్తున్నారని తెలిపారు.
ఈ సినిమాలో నటీనటులు అందరూ కూడా స్టార్ సెలబ్రిటీలు కావడంతో వారికి పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే సినిమా కోసం సరైన బడ్జెట్ లేకపోవడంతో సుమారుగా ఈ చిత్రాన్ని ఎనిమిది సంవత్సరాలపాటు చేశారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి మీదకు దాడికి వచ్చారు.

Aamir Khan: షూటింగుకు కూడా సరిగా వచ్చేవారు కాదు…
ఇలా వాళ్లు మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తావు అంటూ నాన్నని నిలదీస్తున్నప్పుడు నేను చూస్తూ ఉండిపోయానే తప్ప ఏమి చేయలేని పరిస్థితి అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇక రెమ్యూనరేషన్ కూడా సరిగా ఇవ్వకపోవడంతో ఆ సెలబ్రిటీలు షూటింగ్ కి సరిగా వచ్చేవారు కాదు. ఆ సమయంలో నాన్నవారిని ఎంతో బ్రతిమలాడేవారు అంటూ ఈ సందర్భంగా అప్పటి విషయాలను ఈయన గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం అమీర్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































