Actress Karthika: అక్కినేని నాగచైతన్య హీరోగా ఇండస్ట్రీకి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సీనియర్ నటి రాజకుమార్ ది కార్తీక హీరోయిన్ గా నటించారు.ఇలా ఈ సినిమా ద్వారా తన నటనతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో ఈమె పలు సినిమాలలో నటించిన హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయారు.ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ కానటువంటి కార్తిక ఇండస్ట్రీకి దూరమైపోయారు అయితే ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె ప్రస్తుతం ఏం చేస్తుంది ఎక్కడుందనే విషయాలు గురించి ప్రతి ఒక్కరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా కార్తిక ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే ఈమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఉదయ్ సముద్ర గ్రూప్ సంస్థలో ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా తన ప్రతిభ చాటుకుంటోంది. ఇన్నాళ్లు కంపెనీ ఎదుగుదల విషయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఈమె తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది.

Actress Karthika: బిజినెస్ లో సత్తా చాటిన కార్తిక…
ఈమెకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో సత్కరించింది. దుబాయ్ లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో యూఏఈకి చెందిన హమద్ అల్మన్సూరి కార్తీకకు గోల్డెన్ వీసాని అందజేశారు. ఈ క్రమంలోని ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ యంగ్ విమెన్ ఎంట్రప్రెన్యూవర్ గా తనకు గుర్తించి, తనని సత్కరించినందుకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా ఒక హీరోయిన్ కూతురుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించ లేకపోయినా బిజినెస్ ఉమెన్ తన సత్తా ఏంటో నిరూపిస్తున్నారు.