Actress Laila: సర్దార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన రీ-ఎంట్రీ?

0
194

Actress Laila: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ 2004వ సంవత్సరంలో మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అనంతరం ఈమె తెలుగు తెరకు పూర్తిగా దూరమయ్యారు.

ఇక లైలా 2019 వ సంవత్సరంలో ఓ తమిళ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు అలాగే 2020వ సంవత్సరంలో ఓ సీరియల్ లో కనిపించి సందడి చేసిన లైలా ఈ మధ్యకాలంలో మీడియాకు చాలా దూరంగా ఉన్నారు.ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. వెండితెరకు దూరమై కొన్ని సంవత్సరాలు గడిచిన అనంతరం ఈమె కార్తీ నటిస్తున్న సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

తమిళనాడు కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు భాషలో కూడా విడుదల కానుంది తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా విడుదల కానుంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లైలా సందడి చేశారు.

Actress Laila: అన్ని కోణాలలో సినిమా అద్భుతంగా ఉంది..

ఈ వేడుకలో లైలా మాట్లాడుతూ తాను 2003లో శివపుత్రుడు సినిమాలో చేశాను. అయితే ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది.ఇక ఇప్పుడు సర్దార్ సినిమా కూడా దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతుంది. ఇక అదే రోజు నా పుట్టిన రోజు కావడం ఎంతో సంతోషంగా ఉంది.ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డాము ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించాలని ఈమె కోరుకోవడమే కాకుండా నా తెలుగు కుటుంబానికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా లైలా ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.