Actress Laya: స్వయంవరం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి లయ. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన లయ మొదటి సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.

ఇక హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంటున్న తరుణంలోనే ఈమె శ్రీ గణేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.ఇలా విదేశాలలో స్థిరపడినటువంటి లయ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమాలో అవకాశం వచ్చిన కొన్ని కారణాల వల్ల ఈమె ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అయితే మంచి కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలు కనుక వస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి ఈమె ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ తాజాగా తన సినీ కెరియర్లో ఎందుకు చేశానా అని రిగ్రేట్ గా ఫీల్ అయ్యే సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actress Laya: ఆ సినిమాతో కెరీర్ కు పులి స్టాప్ పడింది…
తన సినీ కెరియర్లో మా బాలాజీ అనే సినిమా ఫ్లాప్ సినిమాగా నిలిచిందని అసలు ఈ సినిమాలో ఎందుకు నటించానని ఇప్పటికి తాను అనుకుంటానని ఈమె తెలియజేశారు.ఈ సినిమాలో తాను సెకండ్ హీరోయిన్ గా చేయడంతో తన కెరీర్ కు పుల్ స్టాప్ పడిందని లయ తెలిపారు.ఈ సినిమా తర్వాత తనకు వచ్చిన అవకాశాలన్నీ కూడా సెకండ్ హీరోయిన్ గానే అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా లయ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


































