కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. తాజాగా ఈమె భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.నిశ్చితార్థం ఎంతో గ్రాండ్ గా జరుపుకున్న ఈమె తర్వాత కార్యక్రమం పెళ్లి అని అందరూ భావించినప్పటికీ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చే విషయాన్ని తెలిపారు.భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ విధంగా తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడమే కాకుండా ఆ బంధం అంతటితో ముగిసిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విధంగా తన వివాహం రద్దు కావడంతో సోషల్ మీడియాలో పలు రకరకాల వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే భవ్య భిష్ణోయ్ స్పందిస్తూ… తమ వివాహం రద్దు పై వస్తున్నటువంటి వార్తలను ఖండించారు. అదేవిధంగా తన కుటుంబాన్ని టార్గెట్ చేసి ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ విధంగా మెహ్రీన్ తన పెళ్లిని రద్దు చేసుకోవడంతో సినిమా షూటింగులతో బిజీగా అయ్యారు. పెళ్లి చేసుకుంటే తన సినిమా కెరీర్ కు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ బ్యూటీ తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెహరీన్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 3 సినిమాల్లో నటిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ హాట్ ఫోటో షేర్ చేయడమే కాకుండా అదిరిపోయే క్యాప్షన్ కూడా జోడించారు. ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. మన దగ్గర కత్తి ఉంటే దాని సహాయం పొంది బ్రతకడానికి ఇష్టంలేని మహిళ కన్నా, తన కాళ్ళపై తాను బ్రతికే సత్తా ఉన్న మహిళలు ఎంతో ప్రమాదకరమైన ఆడవాళ్ళని మెహ్రీన్ చెప్పుకొచ్చారు.

































