Actress Rashmika: ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి రష్మిక ఒకరు. ప్రస్తుతం ఈమె నటించిన వరిసు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక నటించిన మిషన్ మజ్ను సినిమా కూడా జనవరి 20వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో రష్మిక పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మికపై ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ కె ఆర్ కె సంచలనమైన ట్వీట్స్ చేశారు. గతంలో కూడా ఈయన రష్మిక గురించి మాట్లాడుతూ తను బాలీవుడ్ ఇండస్ట్రీకి ఏమాత్రం సెట్ కాదని తను భోజపురి సినిమాలకు మాత్రమే సూట్ అవుతుంది అంటూ కామెంట్లు చేశారు.అయితే తాజాగా మరోసారి ఈయన రష్మిక గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే రష్మిక గురించి కె ఆర్ కె ట్విట్ చేస్తూ మేడం రష్మిక మందన్న జీ మీకు కూడా మీ బాయ్ ఫ్రెండ్ అనకొండ (దేవరకొండ) లైగర్ సినిమాకు పట్టిన గతే మీ సినిమాకు కూడా పడుతుంది. మిమ్మల్ని బాలీవుడ్ నుంచి తరిమి కొట్టే సమయం దగ్గర పడింది.మేము మిమ్మల్ని బాలీవుడ్ సినిమాలలో కాకుండా భోజ్ పురి సినిమాలలో చూడటానికి సంతోష పడుతున్నాము అంటూ కామెంట్ చేశాడు.

Actress Rashmika: కెఆర్కె పై మండిపడిన రష్మిక విజయ్ ఫ్యాన్స్….
ఈ విధంగా రష్మిక గురించి ఈయన సంచలనమైన ట్వీట్ చేయడమే కాకుండా మధ్యలో లైగర్ సినిమా గురించి కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడటంతో విజయ్ రష్మిక అభిమానులు తీవ్ర స్థాయిలో కె ఆర్ కే పైతీవ్రస్థాయిలో మండిపడుతూ ముందు నువ్వు నీ సినిమాల గురించి చూసుకో తర్వాత వేరొకరి గురించి ఆలోచిస్తువు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































