నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని నెల రోజులు అవుతున్నా కూడా వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడాకుల తరువాత సమంత, నాగ చైతన్య ఆ విషయాన్ని మర్చిపోయేందుకు సినిమాలలో బిజీ అవుతున్నారు. సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. నాగచైతన్య కూడా మరొకవైపు బిజీ అవుతున్నారు.

ఇక సమంత విడాకుల వ్యవహారం తరువాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి తన స్నేహితులతో కలసి ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన అభిమానులతో పంచుకుంటోంది. ఇదిలా ఉంటే సమంత ఈ సంవత్సరం ఎలా గడిచింది అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
తాజాగా సమంత ముంబైకి చెందిన ఒక మీడియా సంస్థ బాలీవుడ్ నటీనటులతో ప్రతి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే 2021 ఎలా గడిచింది ఒక్క పదంతో చెప్పండి అని ప్రశ్నించగా? ఈ విషయంపై స్పందించిన సమంత “చాలా కష్టంగా గడిచింది” అని చెప్పేసింది.
దీంతో విడాకుల తరువాత సమంత ఎంత మనోవేదనకు గురి అయ్యిందో చెప్పకనే చెప్పేసింది. సమంతా చెప్పినట్టుగా వ్యక్తిగతంగా ఈ ఏడాది చాలా కష్టం అయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనా శైలిలో స్పందిస్తున్నారు.

































