Actress Tamanna: సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ రావడం సర్వసాధారణం అయితే కొందరు సెలబ్రిటీలు ఏమాత్రం పట్టించుకోరు మరికొందరు మాత్రం హద్దు మీరి వారి గురించి రూమర్లు వస్తే ఘాటుగా స్పందిస్తూ సమాధానాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా కూడా గత కొద్దిరోజులుగా డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సందర్భంగా ఈమె గోవాలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి బహిరంగంగా లిప్ లాక్ చేస్తూ ఉన్నటువంటి వీడియో వైరల్ కావడంతో అప్పటినుంచి తమన్నా విజయ్ వర్మ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పై నటుడు విజయ్ వర్మ స్పందించారు.ఇలా డేటింగ్ వార్తలపై విజయ్ వర్మ స్పందించినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్న తన గురించి వస్తున్నటువంటి డైటింగ్ వార్తలపై స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా తమన్న విజయవర్మతో రిలేషన్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం కలిసి ఒక సినిమాలో నటించాము అప్పటి నుంచి మా ఇద్దరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయని తెలిపారు.

Actress Tamanna: స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు…
ఇలా మా ఇద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ప్రతి ఒక్కరికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తనకు లేదంటూ ఈ సందర్భంగా తమన్నా ఘాటుగా స్పందించారు. ఇలా ఈమె డేటింగ్ వార్తలపై స్పందించి కామెంట్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.































