చిరంజీవి చెల్లెలిగా నటించడం వల్లే ఈ హీరోయిన్ అవకాశాలు కోల్పోయిందా?

0
739

సినిమా ఇండస్ట్రీలో సుమారు 100 సినిమాలకు పైగా నటించి ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని పొందిన హీరోయిన్ మోహిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదిత్య 369 సినిమా ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న మోహిని పెళ్లయిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని, ఆమెకు చేతబడి చేశారని వెల్లడించారు.ఈ క్రమంలోనే ఆమె మానసిక పరిస్థితి బాగాలేక రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించినట్లు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

చాలా రోజుల నుంచి మీడియాకు దూరంగా ఉన్న మోహిని తాజాగా మీడియా ముందుకు వచ్చి తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే తన కెరీర్ గురించి మాట్లాడుతూ. తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి కారణం చిరంజీవి గారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు గా నటించాక ఆమెకు అవకాశాలు తగ్గాయని తెలిపారు.

హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించిన తర్వాత చిరంజీవి గారు నువ్వు చెల్లెలుగా నటించవద్దని చెప్పినట్లు తెలిపారు. ఆ సమయంలో హీరోయిన్ సుహాసిని తానుకూడా చిరంజీవి సరసన హీరోయిన్ గా, చెల్లెలు పాత్రలో నటించానని చెప్పి చిరంజీవి గారిని ఒప్పించినట్లు తెలిపారు.

సుమారు 100 సినిమాలకు పైగా నటించిన మోహిని పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వడమే కాకుండా ఎన్నో మానసిక సమస్యలతో సతమతమైనట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మోహినికి ఎవరో చేతబడి చేశారని చేతబడి కారణంగానే అమే వింతగా ప్రవర్తించేదని ఆ సమస్య నుంచి తనని ఏసుప్రభు రక్షించాడని తెలిపారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మోహిని ఈ విధంగా ఏసుప్రభు ని నమ్మి కేథలిక్ గా మారారు. అదేవిధంగా తన పేరును మోహిని నుంచి క్రిస్టియానాగా మార్చుకోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here