Actor Sameer : నటుడు సమీర్.. చాలామందికి పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ మొదటి సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అయితే ఇతడు సీరియల్లో మొదట నటించి.. తర్వాత వెండితెరపై విజయవంతంగా దూసుకెళ్తున్నాడు. అయితే అతడు సీరియళ్ల నుంచి సినిమాల్లోకి తన ఇష్టప్రకారం రాలేదట.

సీరియల్స్ లో నటిస్తున్న క్రమంలో కొన్ని కారణాల వల్ల అతడిని సీరియల్స్ నుంచి పంపించేశారట. దాంతో అతడికి సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అసలు విషయానికి వస్తే.. సమీర్ కెరీర్ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్ లో వరుసగా సీరియల్స్ చేసుకుంటూ.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే నా మొగుడు నాకు సొంతం సీరియల్ హీరోయిన్ తో అతడు ఎఫైర్ పెట్టుకున్నాడని.. సెట్ లోనే సమీర్ రాసలీలలు చేస్తున్నాడని.. కొంతమంది అసత్య ప్రచారం చేశారు. దీంతో సమీర్ ను ఆ సీరియల్ నుంచే కాకుండా ఏకంగా ఈ టీవీ ఛానెల్ నుంచే అర్థంతరంగా పంపించేశారు.
ఈఎంఐలు చెల్లించలేక ఎన్నో కష్టాలు..
నిజ నిర్ధారణ చేసుకోకుండా.. ఎవరో ఏదో చెబితే నమ్మి.. ఇలాంటి నిర్ణయం తీసుకన్నారని.. తనకు రావాల్సిన చెక్కులు కూడా ఇవ్వలేదని అతడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఆ రోజు నుంచి దాదాపు చాలా రోజుల వరకు ఇబ్బందులకు గురయ్యానని.. అద్దెలు కట్టలేక.. ఈఎంఐలు చెల్లించలేక ఎన్నో కష్టాలు అనుభవించినట్లు పేర్కొన్నాడు. కానీ.. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసి ఆయనే ఫోన్ చేసి సారీ చెప్పినట్లు తెలిపారు. కానీ.. అప్పటికే తన మనస్సు ఇరిగిపోయిందని.. మళ్లీ అటు వైపు చేసేందుకు మనస్సాక్షి అంగీకరించలేదు అని.. అన్నాడు. తర్వాత సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రావడంతో వెండితెరపైనే వెలిగిపోతున్నట్లు తెలిపాడు.































