హనీమూన్ కు వెళ్లిన జంట.. తీరా అక్కడికి వెళ్లి చూస్తే?

  0
  35

  సాధారణంగా ఎంతోమంది ప్రేమించుకొని వివాహాలు చేసుకోవడం సర్వసాధారణమే. ఈ విధంగానే ఓ జంట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం వెళ్లిన ఈ జంట అక్కడ భర్త తన భార్యకు ఒక షాకింగ్ విషయాన్ని తెలిపాడు. తను అసలు మగాడు కాదని.. తన మనసుకు ఆడమనిషినని తను లింగమార్పిడి చేసుకోవాలనుకుంటున్నాననే విషయాన్ని భార్యకు తెలియజేశాడు.

  ఈ విధంగా ఆ భర్త తనలో ఉన్న కోరికను తన భార్య ముందు చెప్పడంతో ఆ మాటలు విన్న భార్య ఏ మాత్రం అతనిపై కోపడకుండా తన భర్తకు మద్ధతుగా నిలబడింది. బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాక్, అమెరికా యువతి  హెర్బీలు.. 2006లో సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 2010లో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడటంతో 2016వ సంవత్సరంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ విధంగా వివాహం చేసుకున్న ఈ జంట హనీమూన్ కి వెళ్ళగానే తన భర్త మనసులోని మాటను బయటపెట్టాడు.

  తన భర్త కోరికను విన్న హెర్బీ తన కోరికలను తీర్చడం కోసం ఏకంగా 45వేల పౌండ్లను ఖర్చుచేసి జాక్ కి లింగ మార్పిడి చేయించింది. ఈ విధంగా లింగ మార్పిడి జరిగిన తర్వాత జాక్, హెర్బీ మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ విధంగా ఒక కొత్త పద్ధతులు వీరి వివాహం చేసుకోవడంతో వీరు సోషల్ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందారు. ఈ క్రమంలోనే వీరికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వీరిరువురికీ సంబంధించిన ఈ విషయాన్ని Mirror.ukలో ప్రచురించబడింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here