Aishwarya Rajesh: రష్మికని నేను కించపరచలేదు… తప్పుగా అర్థం చేసుకున్నారు.. క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..?

0
27

Aishwarya Rajesh: తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు పొందిన ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల రష్మీక గురించి ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి. ఇటీవల మీడియా ముందుకి వచ్చిన ఐశ్వర్య రాజేష్ పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర రష్మిక బదులు తనకు బాగా సెట్ అయ్యేదని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక కన్నా తనే బాగా నటించేదాన్ని అని ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యలు చేసినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రూమర్లపై ఐశ్వర్య రాజేష్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో తాను చేసిన కామెంట్స్ పై వివరణ ఇస్తూ.. ఓలేఖ విడుదల చేసింది హీరోయిన్ ఐశ్వర్య.

తాను మాట్లాడిన మాటలను తప్పుగా తీసుకొని రష్మిక ని కించపరిచినట్లు రూమర్లు క్రియేట్ చేస్తున్నారని ఈ నోట్ లో తెలిపింది. తాను రష్మికని కించపరిచినట్లు మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనని తెలుగు సినిమాలలో ఎటువంటి పాత్రలలో నటించాలని ఉంది అని ప్రశ్న ఎదురయింది. ఆ ప్రశ్నకు సమాధానంగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు ఎంతో గౌరవం. తెలుగులో అవకాశాలు వస్తాయి తప్పకుండా చేస్తాను.

Aishwarya Rajesh: రూమర్లను ఆపి వేయండి…


పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర నాకు బాగా నచ్చిందని.. ఆ పాత్ర నాకు సరిగ్గా సెట్ అవుతుందని చెప్పాను. కానీ నా మాటలను తప్పుగా అర్థం చేసుకొని నేను రష్మికను కించపరుస్తూ మాట్లాడినట్లుగా రూమర్స్ క్రియేట్ చేశారు. అంతేకానీ రష్మిక నటన గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. రష్మిక నటన పై నాకు ఎంతో అభిమానం ఉంది. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయకండి అంటూ విన్నవించుకుంది. దీంతో ఐశ్వర్య రాజేష్ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పడింది.