Allu Aravind: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో భాగంగా ఈయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల పలు విషయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పట్ల ఈయన సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా కాంగ్రెస్ నేతలకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

ఇలా తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు బారాస పార్టీ తెలంగాణని పరిపాలించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సినీ సెలబ్రిటీలు కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే సినీ పెద్దలతో కలిసి తమకు కాంగ్రెస్ నేతలను కలుస్తామంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇక ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు పూర్తిస్థాయి మద్దతు తెలియజేసిందని అలాగే ఈ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. ఇక కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని ప్రకటించబోతున్నారు ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత సినీ పెద్దలు అందరూ కూడా కలవబోతున్నారని తెలుస్తుంది.
సినీ పెద్దలతో కాంగ్రెస్ నేతలను కలుస్తాం…
ఇదివరకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర పరిశ్రమకు ఎంతో మద్దతు తెలియజేశారు. ఇకపై ఆటోగ్రఫీ మినిస్టర్ గా ఎవరు ఉంటారు, వారు చిత్ర పరిశ్రమకు ఎలాంటి మద్దతు తెలియచేయబోతున్నారన్న విషయాలపై చిత్ర పరిశ్రమలో కూడా చర్చలు మొదలయ్యాయని తెలుస్తుంది.































