Allu Aravind: జీవిత రాజశేఖర్ ను జైలుకు పంపటానికి 12 ఏళ్లు పోరాటం చేశాను… అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

0
57

Allu Aravind: అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా వేడుకలో భాగంగా అల్లు అరవింద్ చిరంజీవి పై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ చిరంజీవి సినిమాలను చూస్తూ మీరు పెరిగితే ఆయన సినిమాలను చేస్తూ నేను తనకు అభిమానిగా మారిపోయానని తెలిపారు.చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానం ఉందో అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలిపారు.

చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన చూడని సక్సెస్ అంటూ ఏదీ లేదు ఇలా సినిమాలలో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈయన చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి కొందరు నీచంగా మాట్లాడారు. ఇలా మాట్లాడిన వారికి శిక్ష పడాలని 12 సంవత్సరాలు పోరాటం చేశానని తెలిపారు.

Allu Aravind: శిక్ష పడే వరకు పోరాటం చేశాను…


ఈ విధంగా చిరంజీవి గారి గురించి నీచంగా మాట్లాడిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతో తాను 12 సంవత్సరాలు పోరాటం చేసి వారిని జైలుకు పంపించాను అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈయన చేసిన కామెంట్స్ బట్టి చూస్తే ఈయన జీవిత రాజశేఖర్ గురించి మాట్లాడారని స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా చిరంజీవి సినిమా వేడుకలో భాగంగా అల్లు అరవింద్ తనపై ఉన్న అభిమానాన్ని బయటపెడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.