Alphonse Puthren: మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన ప్రేమమ్ సినిమా ఎలాంటి ఆదరణ పొందిదో మనకు తెలిసిందే. 2017 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ వంటి నటీమణులు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.

ఎంతో అద్భుతమైన ఈ సినిమాని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ సినిమా డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రెన్ గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. కానీ తాజాగా ఆయన కుసంబంధించిన ఓపిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈయన ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు ప్రేమమ్ డైరెక్టరేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఈయన నెరసిన గడ్డంతో చాలా బక్క చిక్కి ఉండడంతో అసలు డైరెక్టర్ ఆల్ఫోన్స్ కిఏమైంది ఎందుకిలా మారిపోయారు ఆయన ఆరోగ్యం అంతా బానే ఉంది కదా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈయన గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన డైరెక్టర్ తన ఆరోగ్యం గురించి ఇంతగా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు.

Alphonse Puthren: ప్రేమమ్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న డైరెక్టర్.
ఈ విధంగా తన గురించి ఆలోచించే వారికి ధన్యవాదాలు అని చెప్పినప్పటికీ ఆయన ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక ప్రేమమ్ సినిమా తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను చేయలేదు అయితే ఏడు సంవత్సరాలు తర్వాత గోల్డ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి. ఇందులో భారీ తారాగణం ఉన్నప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
































