ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి ఆధారంగా ఎన్నోరకాల వ్యాధులు కూడా మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే రోజురోజుకు రక్తపోటు షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య అధికమవుతోంది.ఈ విధమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు నిత్యం ఎన్నో కఠిన ఆహార నియమాలను పాటిస్తూ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారికి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి బిళ్ళగన్నేరు ఒక వరం అని చెప్పవచ్చు.

మన చుట్టూ పరిసరాలలో గులాబీ తెలుపు రంగులో ఉండే బిళ్ళ గన్నేరు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా అలంకరణ మొక్కలుగా పెంచుతాము. ఈ క్రమంలోనే ఈ మొక్క నుంచి లభించే ఆకులు వేర్లు పుష్పాలు నుంచి మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మొక్క లో దాగి ఉన్న పోషక విలువలతో క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
మధుమేహంతో బాధపడే వారు బిల్లగన్నేరు వేర్లను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిని ప్రతి రోజు ఉదయం రాత్రి భోజనానికి ముందుఅర టీ స్పూన్ పొడిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇక క్యాన్సర్ తో బాధపడేవారు ఈ పొడితో ప్రతి రోజూ ఉదయం రాత్రి డికాషన్ తయారు చేసుకొని తాగడం వల్ల క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా ఈ ఆకుల నుంచి తీసే పసరు తాగినా కూడా క్యాన్సర్ ను నిరోధించవచ్చు.
ఇక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం బిళ్ల గన్నేరు ఆకులు భాగా నులిమి వాటి నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా మహిళలు రుతుచక్రం సమయంలోకొన్ని సమస్యలకు కూడా ఈ బిళ్ళ గన్నేరుతో చెక్ పెట్టవచ్చు.ఏడెనిమిది బిళ్ల గన్నేరు ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి.ఈ మరిగించిన నీటిని తాగటం వల్ల రుతుచక్ర సమయంలో వచ్చే సమస్యలు అధిక రక్తస్రావం తగ్గుతుంది.


































