Ambanti: ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కులం పట్ల మాజీ మంత్రి అంబంటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మా పార్టీ కార్యకర్తలు చేసిన పోస్టులను పరిగణలోకి తీసుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని అంబంటి రాంబాబు తెలిపారు. అనిత గారి కులం ఏంటి అనేది మాకు ఇప్పటివరకు తెలియదు.

ఈమె ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజం చెప్పాలి అంటే తాను పక్కా క్రిస్టియన్ అని తెలిపారు. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా నా కారులో బైబిల్ ఉంటుంది అలాగే నా హ్యాండ్ బ్యాగ్ లో కూడా బైబిల్ ఉంటుందని తెలిపారు.. ప్రస్తుతం హోం మంత్రిగా అధికారంలో ఉన్న తర్వాత ఈమె హిందువుగా చలామణి అవుతూ తిరుపతి ఆలయానికి కూడా వెళ్తున్నారని రాంబాబు తెలిపారు..
మరి ఈమె హిందువా క్రిస్టియనా అనే సంగతి మాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు.ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దుర్మార్గమైన పయత్నాలు చేస్తున్నారని అంబంటి ఫైర్ అయ్యారు. పాపం హోమ్ మంత్రి చేతిలో ఏమీ ఉండదని అంత నారా లోకేష్ నడిపిస్తున్నారని ఈయన మండిపడ్డారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి నారా లోకేష్ అయ్యన్నపాత్రుడు అచ్చం నాయుడు అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడటమే కాకుండా సంచలనమైనటువంటి ట్వీట్ కూడా చేశారు ఈ విషయంపై మేము ఫిర్యాదులు కూడా చేశాము.

Ambanti:
ఇలా నారా లోకేష్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు ఎందుకని ప్రశ్నించారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈయన డిమాండ్ చేశారు.వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని… న్యాయపరంగా పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అంబంటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.





























