Ramgopal Varam: రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ నిత్యం సంచలన వ్యాఖ్యలు ద్వారా వార్తల్లో నిలిచే వర్మ చిన్న కామెంట్ చేసిన, లేదా సినిమా చేసినా కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఒకప్పుడు ఎన్నో కమర్షియల్ చిత్రాలు తీస్తూ టాప్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వర్మ బయోపిక్ చిత్రాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే వర్మ ఎంతోమంది రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొండా మురళి సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా వర్మ కొండా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రబృందం పలు ప్రాంతాలలో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రామ్ గోపాల్ వర్మ వేదికపై మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు కేకలు వేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే కొండ మురళి మైక్ చేతపట్టుకొని వర్మ చెబితే అమితాబచ్చన్ కూడా వింటారు. ఈ మధ్య కాలంలో కొండ మురళి చెప్పేది కూడా వింటున్నారు. ఇప్పుడు ఆయన మాటలు మీరు కూడా వినాలి అంటూ చెప్పారు.
కొండా మురళి రియల్ హీరో…
కొండా మురళి ఈ విధంగా వర్మ గురించి చెప్పడంతో మైక్ అందుకున్న వర్మ అమితాబచ్చన్ రియల్ హీరో కాబట్టి వర్మ చెప్పేది వింటాడు. కొండ మురళి రియల్ హీరో కనుక ఆయన చెప్పేది వినాలి అంటూ వర్మ కామెంట్ చేశారు. ఈ విధంగా అమితాబచ్చన్ రీల్ హీరో, కొండ మురళి రియల్ హీరో అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక కొండ మురళి దంపతులు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా కొండా మురళి సురేఖ దంపతుల కుమార్తె సుస్మిత నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.




























