Analyst Damu Balaji : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కి పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సస్పెండ్ అయ్యాక శ్రీదేవి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకుల అవినీతి చిట్టా విప్పారు. ఇక వైసీపీ నేతలు కూడా శ్రీదేవి అవినీతికి పాల్పడిందంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ గారు విశ్లేషణ జరిపారు.

ఇరు పక్షాలది తప్పే… ఏపీలో జరుగుతున్న రాజకీయం మరోసారి బయట పడింది…
ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కి పాల్పడింది అనే నెపంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. అయితే అంతకుముందే జగన్ ఆమెతో భేటీ అయి శ్రీదేవి తో మాట్లాడి నెక్స్ట్ ఎన్నికలలో పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పడం వల్లే ఆమె టీడీపీ కి అనుకాలంగా ఓటు వేసి ఉండవచ్చు అని, కేవలం ఒక ఎమ్మెల్సి కోసం 15 కోట్ల డబ్బయితే ఖచ్చితంగా టీడీపీ ఇచ్చుంటుంది అనేది సందేహం అంటూ చెప్పారు. ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం శ్రీదేవి చేసిన తప్పు అంతే కాకుండా సస్పెండ్ అయిన వెంటనే పార్టీ నాయకుల మీద విమర్శలను చేసారు. అవినీతి చేస్తున్నారని అమరావతికి నేను మద్దతు ఇస్తానంటూ చెప్పడం జరిగింది. ఇక ఇటు వైసీపీ నుండి ఆమెను చాలా ట్రోల్ చేస్తున్నారు.

మహిళ అని లేకుండా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇన్ని రోజులు పార్టీలో ఉన్నపుడు కనిపించని అవినీతి పార్టీ నుండి సస్పెండ్ అయ్యాక ఆమెకు అవినీతి చేసిందని కనిపిస్తోంది. ఇక శ్రీదేవి కూడా జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మీడియా ముందు చెప్పారు. అంతే కాకుండా బినామీల పేరుతో అవినీతి జరుగుతోందని శ్రీదేవి ఆరోపించడం జరిగింది. వైసీపీ పార్టీలో ఉన్నపుడు ఆమెకు అవినీతి కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఒకరిపై ఒకరు ఆ పార్టీ వాళ్ళే అవినీతి ఆరోపణలు చేసుకుంటూ పలుచన అవుతున్నారు అంటూ దాము బాలాజీ అభప్రాయపడ్డారు.