Analyst Damu Balaji : అర్ద రాత్రి మహిళ అరెస్టు… కారణం చెప్పకుండా థర్డ్ డిగ్రీ… లంబాడా మహిళా మీద క్రూరత్వం… తెలంగాణలో దారుణం…: అనలిస్ట్ దాము బాలాజీ

0
85

Analyst Damu Balaji : ఆగష్టు 15 రాత్రి సమయంలో ఒక మహిళ మీర్ పేట్ రోడ్డు మీద వెళ్తుండగా పోలీసులు ఆమెను ప్రశ్నించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. టైర్ రబ్బరు తో కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి నడవలేని స్థితికి చేరింంది. తనను ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు మరింత పోలీసులు చితకబాదారు. తెల్లవారుజామున పై అధికారి ఆదేశాల మేరకు ఆమెను వదిలి పెట్టగా ఆమె పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు గిరిజన నాయకుల సహకారంతో ఆమెను కొట్టిన ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

లంబాడా మహిళ మీద దాడి….

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ కాలనీ రోడ్డు నెం 4 లో వరలక్ష్మి అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటోంది. భర్త పదేళ్ల క్రితం మరణించడంతో పిల్లలను ఆమె సాకుతోంది. తాజాగా పెద్ద కూతురు పెళ్లి చేస్తుండటంతో ఆ పనులన్నీ వరలక్ష్మి చూసుకుంటున్నారు. కాగా కూతురు పెళ్లి కోసం డబ్బు అడగడానికి ఆగష్టు 15 నాడు సరూర్ నగర్ లో తెలిసిన బంధువుల ఇంటికి వెళ్లి మూడు లక్షల రూపాయలు డబ్బు తీసుకుని వస్తుండగా తెలిసిన ఆటో అతనికి ఫోన్ చేసి అతని కోసం ఎదురుచూస్తున్న సమయంలో అటుగా వస్తున్న పోలీసులు ఆపి ఆమెను సెక్స్ వర్కర్ గా భావించి పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు. ఆమె తాను సెక్స్ వర్కర్ కాదని కూతురు పెళ్లి గురించి అన్ని విషయాలు చెప్పిన పోలీసులు వినకుండా ఆమెను టైర్ రబ్బరు లాంటి దాంతో పైకి గాయాలు కనిపించకుండా ఉండేలా కొట్టారు. ఆమె ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు మరింత చితకబాధారు. ప్రస్తుతం ఆమె నడవడానికి కూడా కష్టపడేలాగ మోకాళ్ళు చేతులకు ఇలా మొత్తం శరీరం అంత కొట్టారు. ఉదయం విషయం తెలిసి అగ్రహాంచిన కుటుంబ సభ్యులు ధర్నా చేయగా ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసారు.

ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ ఒక సాధారణ మనిషి ఇలా ఒకరిని కొట్టి ఉంటే ముందు వారిని అరెస్టు చేసి హత్య యత్నం కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరిపేవారు. కానీ పోలీసులే ఇలా ప్రవర్తించడం వల్ల కేవలం సస్పెండ్ చేసారూ అంటూ అభిప్రాయపడ్డారు. నిజానికి పోలీసులకు ఇలాంటివి కొత్త కాదు తాజాగా ఆమె మీద సెక్స్ వర్కర్ అంటూ ఆమె ఇంకో మహిళతో కలిసి రోడ్డు మీద రచ్చ చేస్తుంటే పట్టుకున్నామని కేసు నమోదు చెసుకున్నారు. ఆమె పోలీసుల మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకుంటేనే ఆమె మీద కేసు తీసేస్తాం అన్నట్లుగా భవిష్యత్ లో బెదిరిస్తారు. ఇలాంటివి పోలీసులు చేయడం సర్వ సాధారణం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.