Analyst Damu Balaji : కోడికత్తి కేసులో జగన్ షాక్ ఇచ్చిన కోర్ట్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
99

Analyst Damu Balaji : ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం అది కూడా కోడి పందేలలో కోడి కాలికి కట్టే కత్తితో దాడి చేశాడు ఒక వ్యక్తి. 2018లో సంచలనం రికేత్తించిన ఈ కేసు నేటికీ ఇంకా సాగుతోంది. దాడి చేసిన శ్రీనివాస రావు నేనే చేసానని స్వయంగా ఒప్పుకున్నా ఇప్పటికీ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేస్తోంది. అయితే ఈ కేసులో తాజాగా జగన్ కు చుక్కెదురయిందని అనలిస్ట్ బాలాజీ ఈ కేసు గురించి వివరించారు.

పిటిషన్ కొట్టేసిన కోర్ట్…

కోడికత్తి కేసుగా పిలిచే ఈ కేసులో శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్ మోహనరెడ్డి ని వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ దిగుతానని వచ్చి కోడి కత్తితో భుజంపై గాయపరిచాడు. అయితే వెంటనే నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారించగా జగన్ అంటే అభిమానం అని ఆయనకు మైలేజ్ ఇవ్వడానికి, సింపతీ క్రియేట్ చేయడానికే చేసానని కత్తిని రెండు సార్లు స్టెరిలైజ్ కూడా చేసానని, చంపాలనుకుంటే గొంతు మీద కత్తి పెట్టేవాడిని భుజం మీద ఎందుకు గాయపరుస్తా అంటూ శ్రీనివాసరావు విచారణలో తెలిపాడు. అయితే వైసీపీ ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుని టీడీపీ వాళ్ళే చంపించాలని ప్రయత్నం చేసినట్లు ప్రచార చేసుకుని ఎన్నికల్లో సింపతీ గేమ్ ఆడారు అంటూ తెలిపారు.

అయితే ఇప్పటికే ఐదేళ్లుగా రాజమండ్రి జైలులో నిందితుడు ఉన్నాడు. అయితే తాజాగా ఈ కేసులో మళ్ళీ పునః విచారణ జరపాలని ఇందులో కుట్ర కోణం ఉందంటూ జగన్ తరుపున పిటిషన్ వేయగా కోర్ట్ కొట్టేసింది. ఇప్ప్పటికే దర్యాప్తు చాలా ఏళ్లు జరిగిందని, ఎటువంటి కుట్రకు సంబంధించిన ఆధారాలు దొరకలేదని కొట్టేస్తున్నట్లు కోర్ట్ తెలిపింది. నిజానికి జగన్ కు ఈ కేసు పూర్తవడం ఇష్టం లేదని ఈ కేసును మరోసారి ఎన్నికల ముందు వాడుకోవాలని భావిస్తున్నట్లుందని బాలాజీ తెలిపారు. వారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ లో కూడా ఇలాంటి సింపతీ గేమ్ ను మమతా బెనర్జి తో ప్లాన్ చేయించాడు అని టీడీపీ విమర్శిస్తోందంటూ బాలాజీ తెలిపారు.