అనసూయ పొట్టిబట్టలపై ప్రశ్న… వాకౌట్ చేసిన అనసూయ!

0
453

బుల్లితెరపై అందం, అభినయం, మాట తీరు ఉన్న యాంకర్లలో యాంకర్ అనసూయ ఒకరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అనసూయ చాలా చురుకుగా ఉంటారు. తరచూ అనసూయకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే అనసూయ ఎక్కువగా పొట్టి దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఎక్కువగా విమర్శలు పాలవుతుంటారు.

ఈ విధంగా సోషల్ మీడియాలో అనసూయపై నెటిజన్లు చేసే ట్రోలింగ్ కి ఈమె ఘాటుగానే స్పందిస్తూ వారికి సమాధానం చెబుతుంటారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కూడా అనసూయ అందాల ఆరబోతతో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈవారం జరగబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

జబర్దస్త్ కార్యక్రమానికి ప్రతి వారం హైపర్ ఆది కొత్తగా ఎవరో ఒకరిని పరిచయం చేయడం సాధారణమే. ఈ క్రమంలోనే ఈ వారం హైపర్ ఆది యాంకర్ శివను జబర్దస్త్ కార్యక్రమానికి తీసుకువచ్చారు. మామూలుగానే యాంకర్ శివ వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే శివ యాంకర్ అనసూయని ఉద్దేశించి పలు ప్రశ్నలు వేశారు. చాలామంది మీరు పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటారు? అని కామెంట్లు చేస్తుంటారు.నాకు కూడా ఎప్పటినుంచో ఇదే ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది అంటూ అనసూయ అని అడగగా అందుకు అనసూయ ఘాటుగా స్పందించారు..

నా దుస్తుల గురించి వాళ్ళు అన్నారంటే వాళ్లకి ఇండస్ట్రీ గురించి తెలియదు కాబట్టి అలా అన్నారు అనుకోవచ్చు. కానీ మీరు ఇదే ఇండస్ట్రీలో పనిచేస్తూ అడగడం ఏంటి? ఇది నా వ్యక్తిగతం అని అనసూయ సమాధానం చెప్పారు. అప్పుడు శివ వ్యక్తిగతం అయితే మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా? ఇక్కడ ఎందుకు అని అడగగా.. ఒకసారిగా అనసూయ ఆది పై తీవ్రస్థాయిలో కోప్పడ్డారు. ఏంటి అది ఇది.. ఎవరెవరినో తీసుకువస్తారు.. ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయా? అంటూ స్టేజిపై నుంచి దిగి బయటకు వెళ్లారు.అయితే ఇదంతా ప్రోమో కోసమే చేశారా? లేక నిజంగానే ? చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియాలంటే ఈ వారం పూర్తి కార్యక్రమం వచ్చే వరకు ఎదురు చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here